కామారెడ్డి రైల్వే స్టేషన్లో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం.
తెలంగాణ రాష్ట్రం :-
కామారెడ్డి రైల్వే స్టేషన్లో జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులకు దొంగతనాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణ సమయంలో భద్రతా సూచనలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930, మాదక ద్రవ్యాల నివారణ కోసం 1908 నంబర్ వినియోగంపై ప్రజలకు సమాచారం అందించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100/112 కు సంప్రదించాలని సూచించారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్ సేవలు, వారి సంప్రదింపు నంబర్ 8712686094 గురించి తెలియజేశారు.
అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, వేసవి కాలంలో దొంగతనాలపై జాగ్రత్తలు, చిన్నారులు సెలవుల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలని సూచించారు.
పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషరావు, కానిస్టేబుల్స్ ప్రభాకర్, సాయి పాల్గొని పాటలు, మాటల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పాల్గొన్నారు.
