బోధన్‌లో ఘనంగా ఇందిరమ్మ చీరలు, కుట్టు మిషన్ల పంపిణీ.

బోధన్‌లో ఘనంగా ఇందిరమ్మ చీరలు, కుట్టు మిషన్ల పంపిణీ.

బోధన్ ప్రతినిధి రాహుల్‌: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం బుధవారం ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి పట్టణ మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అలాగే మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద అర్హులైన మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు.

 

 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా మహిళల జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.

 

 

 

ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్, మండల తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, మైనారిటీ వెల్ఫేర్ అధికారి బషీర్, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రభుత్వ కానుకలను స్వీకరించారు.