సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు చర్యలు.
చండూర్ ప్రతినిధి రాము : పట్టణంలోని 1వ వార్డు పరిధిలో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, కమిషనర్ ఎల్. మల్లేశం, 1వ వార్డు కౌన్సిలర్ తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
పలు కాలనీల్లో రోడ్లు అధ్వానంగా ఉండటంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించి సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ పనులకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని మున్సిపల్ పాలకవర్గం పేర్కొంది.
