ఘనంగా గణేష్ నవరాత్రి 39వ వార్షిక మహోత్సవాలు.

పూజలో పాల్గొన్న గంజి రాము దంపతులు.

చండూర్ ప్రతినిధి రాము : చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సత్య హరిశ్చంద్ర నగర్‌లో గణేష్ నవరాత్రి 39వ వార్షిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రముఖ రిపోర్టర్ గంజి రాము, గాయత్రి దంపతులు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

 

ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండాలని, విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని గణనాథుడిని ప్రార్థించారు. గణేశుడి ఆశీస్సులతో చండూర్ మున్సిపల్ ప్రజలు, సత్య హరిశ్చంద్ర నగర్ వాసులు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.

 

 

గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతుండటంతో సత్య హరిశ్చంద్ర నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో నవ యువ యూత్ అసోసియేషన్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.