సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన సదస్సు.

సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన సదస్సు.

ఎల్లారెడ్డి ప్రతినిధి: వడ్ల శ్రీనివాస్ చారీ : లింగంపేట్ మండలంలోని ఎర్రపహాడ్ ఎం.జె.పి.టి.బి.సి.డబ్ల్యూ.ఆర్. పాఠశాల, జూనియర్ కళాశాలలో శుక్రవారం సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి బి. మంజుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎం.ఏ. సలీం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 

 

 

ఈ సందర్భంగా ఎం.ఏ. సలీం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసే విధానం, మొదటి అప్పీల్, రెండో అప్పీల్ ప్రక్రియలను వివరించారు. అలాగే విద్యా హక్కు చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం, బాల్య వివాహాల నివారణ చట్టం తదితర చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

కామారెడ్డి జిల్లా సలహాదారు దండగుల లింగమయ్య చట్టాలను వినియోగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లా కార్యదర్శి లెగ్గల రాజు మాట్లాడుతూ సమాచారాన్ని ఇవ్వని అధికారులపై సెక్షన్ 18(1) ప్రకారం ఫిర్యాదు చేయవచ్చని, నిబంధనల ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్ రోజుకు రూ.250 చొప్పున గరిష్ఠంగా రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.

 

 

కార్యక్రమంలో జిల్లా సలహాదారులు ఎస్.కె. మదర్ పాషా, యాదగిరి గౌడ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.