మేరు సంఘం ఆధ్వర్యంలో సంత్ నాందేవ్ మహారాజ్ పుణ్య తిథి వేడుకలు.
బాన్సువాడ ప్రతినిధి శివరామ్: మేరు కుల గురువు, పండరీపురం విఠలేశ్వరుని అగ్రేసర భక్తుడు సంత్ శిరోమణి నాందేవ్ మహారాజ్ 676వ పుణ్య తిథి వేడుకలను మంగళవారం మేరు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కిష్టాపూర్ రాములు మహారాజ్ ఆధ్వర్యంలో వార్కరి భజనలు నిర్వహించారు. అనంతరం గులాల్ పూజ, అభిషేకం, సంత్ నాందేవ్ మహారాజ్ సంక్షిప్త జీవిత చరిత్ర వివరణ, ప్రసాదం పంపిణీ, మహా అన్నదానం చేపట్టారు.
ఈ సందర్భంగా మేరు సంఘం మండల అధ్యక్షుడు వీటూరి హనుమాన్లు మాట్లాడుతూ.. సంత్ నాందేవ్ మహారాజ్ ఆషాఢ శుక్ల త్రయోదశి రోజున పండరీపురంలో సమాధి చెందారని తెలిపారు.

విఠలేశ్వరునిపై అనేక అభంగాలు రచించిన ఆయన, సిక్కు సంప్రదాయంలోనూ 65 అభంగాల ద్వారా తన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారని పేర్కొన్నారు. నాందేవ్ మహారాజ్ గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో మేరు సంఘ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
