జానకంపేటలో పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్.

జానకంపేటలో పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్.

నిజామాబాద్ ప్రతినిధి చందర్ :- నిజామాబాద్ జిల్లా. ఎడపల్లి మండలం జానకంపేటలోని పోలీస్‌ ఫైరింగ్‌ కేంద్రంలో జిల్లా పోలీసు సిబ్బందికి గురువారం ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ సమక్షంలో నిర్వహించిన శిక్షణలో సిబ్బంది నిర్ణీత లక్ష్యాలపై ఫైరింగ్‌ నిర్వహించారు. లక్ష్యసాధన, ఖచ్చితత్వం, ఏకాగ్రతతో పాటు ఆయుధాల వినియోగ నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు.

 

 

 

అత్యవసర పరిస్థితులు, నేరస్తులపై చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సమర్థవంతంగా స్పందించేందుకు నిరంతర ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ అవసరమని కమిషనర్‌ తెలిపారు. ఆయుధాలను సురక్షితంగా, సమర్థవంతంగా వినియోగించాలని, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విధి నిర్వహణలో మరింత సమర్థంగా పనిచేసేందుకు సిబ్బంది తమ ఫైరింగ్‌ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్‌) ఎన్. శుభం ప్రకాష్‌తో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, టాస్క్‌ఫోర్స్, సీటీసీ, ట్రాఫిక్, ఏఆర్, హోంగార్డ్స్, ఐటీ విభాగాలకు చెందిన ఏసీపీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, పీఎస్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.