విద్యార్థి సిద్దు నాయక్‌కు రూ.5 వేల నగదు బహుమతి.

విద్యార్థి సిద్దు నాయక్‌కు రూ.5 వేల నగదు బహుమతి.

వర్ణి ప్రతినిధి చందర్:  వర్ణి మండల కేంద్రంలోని వడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టిగుట్ట గ్రామానికి చెందిన విద్యార్థి సిద్దు నాయక్‌ను ప్రత్యేకంగా సత్కరించారు.

 

 

 

గత విద్యా సంవత్సరంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో సిద్దు నాయక్ 540 మార్కులు సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చినందుకు అభినందించారు. ఈ సందర్భంగా ఎస్‌.ఎన్‌.పురం గ్రామ ఉపసర్పంచ్ రెడ్డి శ్రీరాములు తన కుమారుడు రెడ్డి పృథ్వీరాజ్ జ్ఞాపకార్థం సిద్దు నాయక్‌కు రూ.5,000 నగదు బహుమతిని అందజేశారు.

 

విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారు ఉన్నత చదువుల వైపు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారని శ్రీరాములు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.