బోధన్‌లో ఘనంగా ఆర్ఎస్ఎస్ “యువ శక్తి సమ్మేళనం”

బోధన్‌లో ఘనంగా ఆర్ఎస్ఎస్ “యువ శక్తి సమ్మేళనం”

 

బోధన్ ప్రతినిధి రాహుల్‌: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బోధన్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి కల్యాణ మండపంలో ఆదివారం “యువ శక్తి సమ్మేళనం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. శ్రీ రామకృష్ణ, బోధన్ నగర సంఘ్ చాలక్ శ్రీ గణేష్ రావు కులకర్ణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాన వక్తగా శ్రీ ఆయుష్ పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలు, ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం, సంస్థ శతాబ్ది ప్రస్థానం, దేశాభివృద్ధిలో యువత పాత్ర తదితర అంశాలపై వివరించారు.

 

 

 

యువత తమలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని సమాజ సేవలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, సామాజిక బాధ్యత వంటి విలువలను యువత జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత, బాధ్యతాయుతమైన పౌరస్పూర్తిని పెంపొందించడంలో యువత కీలక పాత్ర పోషించాలని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు, ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.