వాజ్‌పేయి సేవలు స్ఫూర్తిదాయకం: కోణాల గంగారెడ్డి.

వాజ్‌పేయి సేవలు స్ఫూర్తిదాయకం: కోణాల గంగారెడ్డి.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్భా:- రత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 8వ వర్ధంతి సందర్భంగా బాన్సువాడలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ, దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని అన్నారు.

 

 

ఆయన దూరదృష్టి, సుపరిపాలన, ప్రజా సంక్షేమంపై చూపిన శ్రద్ధ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశంలో జాతీయ రహదారుల విస్తరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి వాజ్‌పేయి ప్రభుత్వం విశేష కృషి చేసిందని గుర్తుచేశారు. దేశ సమగ్రాభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ సమైక్యత కోసం వాజ్‌పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

 

ఆయన ఆదర్శాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చిదుర సాయిలు, బీజేపీ కౌన్సిలర్ గజల మహేష్, నాయకులు పాశం భాస్కర్‌రెడ్డి, చీకట్ల రాజు, సాయిరెడ్డి, ప్రదీప్ సింగ్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.