కోనాపూర్ లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

కోనాపూర్ లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

బాన్స్వాడ ప్రతినిధి వడ్ల శ్రీనివాస్ చారి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఎల్లగొని కిష్టవ్వ, రైతు వేదిక వద్ద వ్యవసాయ విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వద్ద డాక్టర్ మానస, హరిజనవాడ స్కూల్ వద్ద టీచర్ ఫరీదా, అంగన్వాడి సెంటర్ వద్ద వినాయ రాణి, బస్టాండ్ సమీపంలో సమాచార హక్కుచట్టం ఆధ్వర్యంలో బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు వడ్ల నారాయణ చారి, మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పంచాయతీ

 

 

సెక్రటరీ రాజేష్, ప్రాథమిక పాఠశాల వద్ద ప్రధానోపాయురాలు రాధా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కందుకూరి శేఖర్, బిజెపి ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు సాయిబాబా, అంబేద్కర్ విగ్రహం వద్ద గైని చిన్న సాయిలు జాతీయ జెండాలను ఆవిష్కరిస్తూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

 

 

ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ బంజ భూషణం, జిపిఓ విట్టల్, నాయకులు గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు జెట్టి హన్మాండ్లు, ఎల్లగొని రాజేశ్వర్గౌడ్, వెంకటరమణ రావు దేశ్ముఖ్, దత్తాత్రి రావు గాండ్ల సాయిలు, సి.హెచ్ సాయి బాబా, అంజగౌడ్, బెజవాడ భూమయ్య, లక్ష్మీనారాయణ, అమిరద్దీన్ శ్రీనివాస్, దశరథ్ వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.