ప్రజలకు ఉత్తమ సేవలు.. వర్ని ఎస్ఐకి ప్రశంస పత్రం.
వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన వర్ని ఎస్ఐ వంశీకృష్ణారెడ్డికి ఉత్తమ సేవల గుర్తింపు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నిజామాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆయనకు ప్రశంస పత్రం అందజేసి సన్మానించారు.
పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ప్రతిభ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని వంశీకృష్ణారెడ్డిని ఈ ఏడాది ఉత్తమ సేవల పురస్కారానికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆయన చూపిన చొరవను అధికారులు అభినందించారు.

ప్రశంస పత్రం అందుకున్న ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి సత్కరించడం మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ఆయనకు ఉత్తమ సేవల పురస్కారం లభించడంపై పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
