కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలి
రంగారెడ్డి మహేశ్వరం ప్రతినిధి వినోద్ : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిరాల–కొంగరకలాన్ ప్రాంతంలో కలెక్టరేట్ సమీపంలోని 330 ఫీట్ రేడియల్ రోడ్డును మాజీ ఎమ్మెల్యే కిచెన్ అన్న లక్ష్మారెడ్డి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సందర్శించనున్నారు.
ఈ సందర్భంగా రేడియల్ రోడ్డుకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు నిర్వహిస్తున్న ఈ సందర్శన కార్యక్రమానికి సమీప ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
కావున మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సకాలంలో కార్యక్రమానికి చేరుకుని విజయవంతం చేయాలని కోరారు.
