పోరండ్ల, సుభాన్‌పూర్ గ్రామాల్లో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం ప్రతినిధి వినోద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని పోరండ్ల, సుభాన్‌పూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 

మొదట పోరండ్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆల్వాల్ శీను కుమారుడు కీర్తిశేషులు ఆల్వాల్ తిరుమల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, వారి బాధను పంచుకున్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

 

అనంతరం సుభాన్‌పూర్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు పోచారం తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న బాధను తెలుసుకుని, కుటుంబానికి కలిగిన తీరని లోటుపై విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొంటూ, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు.

 

మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.