మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రూ.10 వేల ఆర్థిక సాయం.

కర్నూల్ ప్రతినిధి సురేష్ :-  నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీకి చెందిన జి. వెంకటయ్య ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.

 

 

 

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అడపాల గోపాల్ రెడ్డి, సాయినగర్ మాజీ కౌన్సిలర్ శ్రీమతి సుంకరి నిర్మల బాలరాజు, అచ్చంపేట టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖాదర్, కటకం రఘురాం, మున్సిపల్ కమిషనర్‌తో పాటు సాయినగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.