తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజుల గడువు మరోసారి పొడిగింపు.

 

హైదరాబాద్ ప్రతినిధి గౌరవ్ బీడ్కర్ :-  మే 2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు నిర్ధారణ, చెల్లింపు గడువును తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరోసారి పొడిగించింది. ఈ నిర్ణయం మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన జనరల్, వొకేషనల్ అభ్యర్థులకు వర్తిస్తుంది.

 

 

బోర్డు ప్రకటన ప్రకారం, రూ.3,000 ఆలస్య రుసుముతో 2026 మే 2 నుంచి మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. చివరి నిమిషం ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు ముందుగానే ఫీజు చెల్లించాలని సూచించారు.

 

 

అభ్యర్థులు తమ కళాశాలల ద్వారా లేదా సంబంధిత అధికారిక ప్రక్రియల ద్వారా ఫీజు చెల్లింపును పూర్తి చేయాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ గడువు తర్వాత మరింత పొడిగింపు ఉండకపోవచ్చని విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.