వర్నిలో నూతన మారుతి సుజుకి బ్రెజ్జా వాహనం ఆవిష్కరణ.
వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని వరుణ్ మోటార్స్ షోరూమ్‌లో నూతన మారుతి సుజుకి బ్రెజ్జా (New Brezza) వాహనాన్ని ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ప్రత్యేక పూజల అనంతరం రిబ్బన్ కట్ చేసి వాహనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సురేష్ బాబా మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందిన నూతన బ్రెజ్జా వాహనం వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదిస్తున్న వరుణ్ మోటార్స్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

అనంతరం షోరూమ్ ప్రతినిధులు నూతన బ్రెజ్జా వాహనం ప్రత్యేకతలు, ఆధునిక ఫీచర్లు, మైలేజ్, భద్రతా వ్యవస్థలపై అతిథులకు వివరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు వాహనాన్ని పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్ని మండల ప్రజాప్రతినిధులు, వరుణ్ మోటార్స్ యాజమాన్యం, సిబ్బంది, వాహన కొనుగోలుదారులు, ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.
