రాష్ట్రవ్యాప్తంగా బాలికల కోసం ‘స్నేహ సమ్మర్ క్యాంప్స్’ ప్రారంభం.

రాష్ట్రవ్యాప్తంగా బాలికల కోసం ‘స్నేహ సమ్మర్ క్యాంప్స్’ ప్రారంభం.

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో యవతీ బాలికల కోసం ‘స్నేహ సమ్మర్ క్యాంప్స్’ ప్రారంభమయ్యాయి. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడుతున్నాయి.

 

 

మే 2 నుంచి జూన్ 10 వరకు నిర్వహించబడుతున్న ఈ శిబిరాల్లో బాలికల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోగ్యం, భద్రత, విద్య, జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించే వివిధ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 

 

బాల్య వివాహాల నివారణ, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల్లో బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ అలవాట్లు, పొదుపు ప్రాముఖ్యతపై శిక్షణ ఇస్తున్నారు.

 

 

 

క్రీడలు, యోగా, శారీరక వ్యాయామం, కెరీర్ మార్గదర్శకత, నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నారు. సైబర్ భద్రత, స్మార్ట్‌ఫోన్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.

 

 

క్యాంప్ ముగింపులో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనుండగా, గ్రామ స్థాయిలో బాల్య వివాహాల నివారణ, బాలికల భద్రత, విద్య ప్రోత్సాహం అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి సురక్షిత భవిష్యత్తు కల్పించడమే లక్ష్యంగా అధికారులు తెలిపారు.