బాలబాలికల సదాచార శిక్షణ శిబిరం ఘనంగా ముగింపు – బోధన్‌లో ఆధ్యాత్మిక వాతావరణం.

బాలబాలికల సదాచార శిక్షణ శిబిరం ఘనంగా ముగింపు – బోధన్‌లో ఆధ్యాత్మిక వాతావరణం.

నిజామాబాద్ ప్రతినిధి రాహుల్:- నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్య సమాజం దయానంద గోశాలలో నిర్వహించిన బాలబాలికల సదాచార శిక్షణ శిబిరం సమాపన సమారోహం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.

 

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ, “పిల్లల్లో సద్గుణాలు, సంస్కారం పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే క్రమశిక్షణ, వినయం, ధర్మం అనేవే పునాది” అని ఆధ్యాత్మిక సందేశం అందించారు.

 

శిబిరంలో భాగంగా బాలబాలికలకు కరాటే, యోగా, ప్రాణాయామం, నైతిక విలువలు, భారతీయ సంస్కృతి వంటి అంశాల్లో శిక్షణ అందించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని కరాటే విన్యాసాలు, యోగా ప్రదర్శనలతో తమ ప్రతిభను ప్రదర్శించారు.

 

 

 

ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ ప్రతినిధులు, గురువులు, తల్లిదండ్రులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిబిరం ద్వారా పిల్లల్లో భక్తి భావం, క్రమశిక్షణ మరియు నైతిక విలువలు పెంపొందడంలో ఇది ఎంతో ఉపయోగపడిందని నిర్వాహకులు తెలిపారు.

చివరగా పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి రసంతో విజయవంతంగా ముగిసింది.