చెక్కి క్యాంప్‌లో “మన ఊరు-మన భద్రత-మన బాధ్యత” కార్యక్రమం.
ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన.
బోధన్ ప్రతినిధి రాహుల్ :- నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 13వ వార్డు చెక్కి క్యాంప్ ప్రాంతంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “మన ఊరు-మన భద్రత-మన బాధ్యత” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీపీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాల నుంచి ఎలా జాగ్రత్తపడాలనే విషయాలపై ప్రజలకు వివరించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి కాలనీలో భద్రతా చర్యలు పెంపొందించాలని కోరారు.

కార్యక్రమంలో ఏరియా కౌన్సిలర్ లంక రవి, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఎస్ఐ మనోజ్, ఏఎస్సై బాబురావు మరియు బోధన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రజలకు భద్రతా సూచనలు అందించారు. పోలీస్ శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను స్థానికులు అభినందించారు.
