వరంగల్ జిల్లా: పెద్ద తండ గ్రామంలో గ్రామ సంఘాల భవనాల శిలాఫలక ప్రారంభోత్సవం.
వరంగల్ ప్రతినిధి : సెంగెం మండలం పెద్ద తండా గ్రామంలో గ్రామ సంఘాల భవనాల శిలాఫలక ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామ సంఘాల భవనాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంటూ, గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పెద్ద తండా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ గూగులోత్ వినోద్ రెవీందర్ నాయక్, గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సంఘాల సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
