బాన్సువాడలో యువజన కాంగ్రెస్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం.

బాన్సువాడలో యువజన కాంగ్రెస్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం.

బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్:- కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నేడు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కో-ఇంచార్జ్ రోషిణి జైస్వాల్, జిల్లా ఇంచార్జ్ థామస్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

 

ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, యువతను కాంగ్రెస్ సిద్ధాంతాల వైపు ఆకర్షించడం, గ్రామస్థాయి నుండి పార్టీ కార్యక్రమాలను విస్తరించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి మండలం, గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసి పార్టీకి బలమైన పునాది నిర్మించాలని నాయకులు సూచించారు.

రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్ మరింత చురుకుగా పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

 

 

 

ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ మన్సూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల అభిషేక్, మొహమ్మద్ అబ్బు, సాజిద్, అజీమ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం విజయవంతంగా ముగిసింది.