కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో అవగాహన కార్యక్రమం.
కామారెడ్డి ప్రతినిధి :- కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టబడింది.
ఈ కార్యక్రమంలో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవి కాలంలో పాటించాల్సిన భద్రతా చర్యలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అలాగే హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.

సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930, అత్యవసర సేవలకు డయల్ 100 వినియోగంపై ప్రజలకు వివరించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్ సేవలు, టోల్ ఫ్రీ నంబర్ 872686094 గురించి కూడా తెలియజేశారు.
పిల్లలు సెలవుల సమయంలో ఈతలకు వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్స్ రామంచ తిరుపతి, శేషరావు, కానిస్టేబుల్స్ ప్రభాకర్, సాయిలు పాటలు, మాటల ద్వారా అవగాహన కల్పించారు.

అలాగే షీ టీమ్ సభ్యులు WPC సౌజన్య, PC భూమయ్య, మానవ అక్రమ రవాణా విభాగం PC రాజేందర్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

