మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ శంకర్ కుటుంబానికి మిత్ర బృందం పరామర్శ, ఆర్థిక సాయం.

 

మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ శంకర్ కుటుంబానికి మిత్ర బృందం పరామర్శ, ఆర్థిక సాయం.

హనుమకొండ ప్రతినిధి : పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ శంకర్ విధి నిర్వహణలో ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. భద్రాచలం నుంచి పరకాలకు తిరుగు ప్రయాణంలో ఇల్లందు క్రాస్ వద్ద బస్సులోనే కుప్పకూలడంతో ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

 

 

 

ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలోని శంకర్ స్వగృహానికి ఆయన భార్య సౌందర్య చిన్ననాటి పదో తరగతి (1994-95 బ్యాచ్) మిత్రులు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

 

 

 

ఈ కార్యక్రమంలో లావుడియా రాజు నాయక్, గూడెపు రఘుపతి, దుండ్ర రాజయ్య, మూడెత్తుల రవి, లింగంపల్లి రాజేశ్వరరావు, మాకోటి శ్రీనివాస్, తులాల సునీత, కందకట్ల శ్రీలత, చాడ మాధవి తదితరులు పాల్గొన్నారు. అలాగే బంధుమిత్రులు, ఆర్టీసీ సిబ్బంది కూడా హాజరై శంకర్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.