బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో 3వ వార్డు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభ.
బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్:- ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 9 గంటలకు బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో 3వ వార్డు సభను నిర్వహించారు. ఈ సభకు కౌన్సిలర్ హకీమ్ అధ్యక్షత వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో 3వ వార్డు ప్రజలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వార్డు వాసులు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పెన్షన్, జీరో కరెంట్ బిల్లు, రేషన్ కార్డులు, ఇంటి నంబర్ కేటాయింపు, రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు సంబంధించిన సమస్యలను అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మ ఏజాజ్, మాజీ జిల్లా పరిషత్ కో–ఆప్షన్ మెంబర్ షేక్ అలీం ఉద్దీన్ బాబా, సీనియర్ నాయకులు షేక్ మొయిన్, మొహమ్మద్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.

అధికారుల తరఫున మున్సిపల్ కమిషనర్ జి. గంగాధర్, మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సంగమేశ్వర, విద్యుత్ శాఖ అధికారి మోహన్, ప్రతినిధి సభ్యులు జమీల, రేఖ తదితరులు హాజరయ్యారు.
సభను విజయవంతం చేసిన ప్రజలు, అధికారులు మరియు నాయకులకు కౌన్సిలర్ ఎం.ఏ. హకీమ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
