వర్నిలో కాంగ్రెస్ మైనార్టీ నేత అబ్దుల్ బారీ జన్మదిన వేడుకలు ఘనం.

వర్నిలో కాంగ్రెస్ మైనార్టీ నేత అబ్దుల్ బారీ జన్మదిన వేడుకలు ఘనం.

వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ మైనార్టీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ బారీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ని మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అబ్దుల్ బారీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోగా, అనంతరం పూలమాలలు, శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

 

 

ఈ సందర్భంగా కులకర్ణి సురేష్ బాబా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అబ్దుల్ బారీ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజల సమస్యలను పార్టీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

అబ్దుల్ బారీ మాట్లాడుతూ, తన జన్మదిన వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల బలోపేతానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

 

 

కార్యక్రమం అనంతరం నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.