బాన్సువాడ నాయీబ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.
బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్ :- కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శనివారం నాయీబ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ రాష్ట్ర చైర్మన్ కాసుల బాలరాజును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు డాక్టర్ కోత్వాల్ తుకారాం సంఘ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సంఘ భవన నిర్మాణంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు రూ.10 లక్షల నిధులు అవసరమని తెలిపారు. సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
సంఘ గౌరవాధ్యక్షుడిగా కొంపల్లి సాయికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ కోత్వాల్ తుకారాం, కార్యదర్శిగా అనిల్ కుమార్, కోశాధికారిగా విజయ్, జాయింట్ సెక్రటరీగా కొంపల్లి శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.
