జిల్లా ఆస్పత్రిలో వసతులు పెంచాలి: సీపీఎం.

జిల్లా ఆస్పత్రిలో వసతులు పెంచాలి: సీపీఎం.

సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ లేకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరిక

బోధన్ ప్రతినిధి రాహుల్ :-  బోధన్ జిల్లా ఆస్పత్రిలో వసతులు పెంచి, అవసరమైన వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని సీపీఎం డిమాండ్ చేసింది. శనివారం పార్టీ నాయకులు జిల్లా ఆస్పత్రిని సందర్శించి వైద్యులు, రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

 

 

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు మాట్లాడుతూ, జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ తగిన వైద్యులు, సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గైనకాలజిస్టులు, ఆర్థోపెడిక్ వైద్యులు, స్కానింగ్ టెక్నీషియన్లు లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు షకీల్ అహ్మద్ సుదర్శన్ రెడ్డి జిల్లా ఆస్పత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆస్పత్రిలో అవసరమైన వైద్య సిబ్బంది, టెక్నీషియన్లు, మందులు అందుబాటులో ఉంచాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

 

 

ఈ కార్యక్రమంలో సీపీఎం ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్, నాయకులు వేషాల గంగాధర్, జంగం గంగాధర్, రాములు, నాగలక్ష్మి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.