అచ్చంపేట సాయినగర్ కాలనీలో పోలియో చుక్కల కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల పాల్గొనం.

అచ్చంపేట సాయినగర్ కాలనీలో పోలియో చుక్కల కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల పాల్గొనం.

నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట ప్రతినిధి సురేష్ :-  అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

 

 

అలాగే తల్లిదండ్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.