మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన జెర్కోని రాజు

రంగారెడ్డి ప్రతినిధి వినోద్ (ఇబ్రహీంపట్నం) : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జెర్కోని రాజు నాయకులతో కలిసి బీఆర్‌ఎస్‌ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డిని వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.