లేబర్ కోడ్‌ల రద్దుకై పోరాటం చేయాలి: ఐఎఫ్‌టీయూ పిలుపు.

లేబర్ కోడ్‌ల రద్దుకై పోరాటం చేయాలి: ఐఎఫ్‌టీయూ పిలుపు.

బోధన్ మండలం ప్రతినిధి రాహుల్:- 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్‌లోని ఐఎఫ్‌టీయూ కార్యాలయం వద్ద ఘనంగా మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వరదయ్య ఎర్రజెండాను ఆవిష్కరించారు.

 

 

అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కార్మికలోకానికి పిలుపునిచ్చారు. కార్మికులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం కొత్త విధానాలు తీసుకువచ్చిందని విమర్శించారు.

 

 

 

ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం రూ.26,000 అమలు, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని డిమాండ్ చేశారు.

 

 

ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. సాయిలు, తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గంగాధర్ గౌడ్, రాజ్‌కుమార్, వినోద్, బండారి గంగాధర్, సాయ గౌడ్, నారాయణ, శంకర్ గౌడ్, రాజేందర్ గౌడ్, పల్లవి, శ్రీనివాస్, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.