బోధన్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా తూము శరత్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.

బోధన్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా తూము శరత్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి రాహుల్:- బోధన్ మున్సిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కె. నగేష్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

 

 

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పాషా మోహినుద్దీన్ ఆధ్వర్యంలో నూతన ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక లేఖను అందజేశారు.

 

 

 

ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన తూము శరత్ రెడ్డికి పార్టీ నాయకులు, కౌన్సిలర్లు అభినందనలు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు.

 

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు అంకు దాము, రవి, రామరాజు, జహీర్ తదితరులు పాల్గొన్నారు.