మందర్నాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం – లబ్ధిదారుల ఆనందం.
నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రతినిధి రాహుల్ :- సాలూర మండలంలోని మందర్నా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లను గురువారం ఘనంగా ప్రారంభించారు. మల్లెపూల దేవ్ భాయ్, సిరిసే పూర్ణిమలకు మంజూరైన కొత్త ఇళ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, “ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల నెరవేరింది. ప్రజా ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి గౌరవంగా జీవించే అవకాశం కల్పించింది” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శంకర్, తాసిల్దార్ నవాజ్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ శివా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మందర్నా రవి, నాయకులు అశోక్, అనిల్, సర్పంచ్ సావిత్రి గంగాధర్, ఉప సర్పంచ్ శేషే ప్రహ్లాద్, ప్రకాష్, లక్ష్మణ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు అధికారులు, నాయకులను ఘనంగా సన్మానించారు. పేదల సొంతింటి కలను నిజం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని నాయకులు పేర్కొన్నారు.
