ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ.

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ.

వర్ని ప్రతినిధి చందర్ :-  నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని సేవలాల్ తాండ అడవి ప్రాంతంలో పనిచేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు శుక్రవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీలకు చల్లని మజ్జిగ అందజేసి ఉపశమనం కల్పించారు.

 

 

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనకదుర్గ రవి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి సాయిలు, మండల ఎంపీడీవో వెంకటేశ్వర్లు, టీఏ వినోద్, వార్డు సభ్యులు సరిచంద్ గంగారాం, ఉపాధి హామీ మేట్లు అశోక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా కార్యక్రమంలో పాల్గొని సహకరించారు.

 

 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎండల తీవ్రతలో ఉపాధి హామీ కూలీల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.