శ్రీ దత్త దివ్య క్షేత్ర దర్శనం గ్రంథావిష్కరణ మహోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా.

శ్రీ దత్త దివ్య క్షేత్ర దర్శనం గ్రంథావిష్కరణ మహోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా.

హైదరాబాద్, సనత్‌నగర్ : శ్రీపాద శ్రీవల్లభ జ్ఞానామృత మధుకరి సేవా సమితి ఆధ్వర్యంలో “108 శ్రీ దత్త దివ్య క్షేత్ర దర్శనం” గ్రంథావిష్కరణ కార్యక్రమం ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ దత్త ఆలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడనుంది.

 

 

ఈ గ్రంథాన్ని బ్రహ్మశ్రీ శ్రీపాద శివకుమార్ శర్మ గారు రచించగా, ప్రముఖ దత్త మార్గ ప్రచారకులు బ్రహ్మశ్రీ నూకల ప్రభాకర్ శర్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అలాగే బెంగళూరుకు చెందిన అవిముక్త దత్త క్షేత్ర పీఠాధిపతి బ్రహ్మశ్రీ కేశవ మూర్తి గారు కూడా కార్యక్రమానికి హాజరుకానున్నారు.

 

 

 

కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు నిస్వార్థ సేవ భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ దత్త భజనలతో ప్రారంభమవుతుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు గ్రంథావిష్కరణతో పాటు అతిథుల ప్రసంగాలు జరుగనున్నాయి. రాత్రి 8:30 గంటలకు శ్రీ దత్త హారతి నిర్వహించి, అనంతరం భక్తులకు దత్త ప్రసాద వితరణ చేయనున్నారు.

 

 

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని శ్రీమాన్ కిషోర్ కులకర్ణి గారు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.