హైకోర్టు ఆదేశాలతో పీఏసీఎస్ కొత్తపల్లి పాలకవర్గం బాధ్యతల స్వీకారం.
ఇంచార్జ్ చైర్మన్‌గా డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి బాధ్యతలు.
కోటగిరి ప్రతినిధి రాహుల్ :- హైకోర్టు మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు, కోఆపరేటివ్ శాఖ సూచనల ప్రకారం కోటగిరి మండలంలోని కొత్తపల్లి పీఏసీఎస్ సొసైటీ నూతన పాలకవర్గం శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. మధ్యాహ్నం 12:15 గంటలకు జరిగిన కార్యక్రమంలో డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి ఇంచార్జ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
డైరెక్టర్లుగా పులిచెర్ల లక్ష్మారెడ్డి, గుగులోతు తుకారాం, వల్లెపల్లి శ్రీనివాసరావు, దుబాస్ కృష్ణ, సురేష్ పటేల్, బాటి నిరంజన బాయి, సుభాష్ పటేల్, శంకర్ బాధ్యతలు స్వీకరించారు. పీఏసీఎస్ కొత్తపల్లి ఇంచార్జ్ సెక్రటరీ కమలేష్ మరియు ప్రభుత్వ పర్సన్-ఇన్-చార్జ్ ఎం.పుష్ప నుంచి నూతన పాలకవర్గం అధికారికంగా చార్జ్ తీసుకుంది.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాలకవర్గం సొసైటీ కార్యాలయంలో రైతులకు సంబంధించిన ట్యాబ్ ఎంట్రీలు, ఇతర సేవలను పరిశీలించింది. రైతులకు అవసరమైన సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
రైతుల పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని, సొసైటీ వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ప్రతిరోజూ పాలకవర్గం పర్యవేక్షణ కొనసాగుతుందని ఇంచార్జ్ చైర్మన్ డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.
