బోధన్‌లో 60 ఈత చెట్లు కూల్చి కాల్చివేత – గీత కార్మికుల ఆందోళన.

బోధన్‌లో 60 ఈత చెట్లు కూల్చి కాల్చివేత – గీత కార్మికుల ఆందోళన.

బోధన్ ప్రతినిధి రాహుల్:- బోధన్ పట్టణంలోని పసుపు వాగు ప్రాంతంలో ఈత చెట్లను కూల్చి కాల్చివేసిన ఘటన గీత కార్మికుల్లో ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గీత కార్మికులు బోధన్ ఎక్సైజ్ సీఐ భాస్కరరావుకు ఫిర్యాదు చేశారు.

 

 

గీత కార్మిక సంఘం నాయకుల వివరాల ప్రకారం, సర్వే నంబర్ 594లో ఉన్న 8 ఎకరాల 6 గుంటల భూమి కల్లు గీత కార్మిక సంఘానికి చెందిన సొంత భూమి. ఈ భూమిలో ఈతవనం పెంచుతూ, ఈత కళ్ల ద్వారా పలువురు గీత కార్మికులు ఉపాధి పొందుతున్నారు.

 

 

శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈతవనంలోకి ప్రవేశించి 50 నుంచి 60 ఈత చెట్లను కూల్చివేసి కాల్చివేశారని కార్మికులు ఆరోపించారు. ఈ ఘటన వల్ల తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని, ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పి. గంగాధర్ గౌడ్, బి. లింగా గౌడ్, కందుకాల శ్రీకాంత్ గౌడ్, వై. జీవన్ గౌడ్, వై. రమేష్ గౌడ్, ఎం. రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కల్లు గీత కార్మిక సంఘం నాయకులు, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.