వర్నిలో ఘనంగా సాత్విక, తన్వైశ్రీ నూతన వస్త్రధారణ మహోత్సవం.
వర్ని ప్రతినిధి చందర్: వర్ని మండల కేంద్రంలోని వీఎంఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం ఉమ్మడి వర్ని మండల మాజీ జెడ్పీటీసీ రాణజ్య నాయక్ మనుమరాళ్లు, బాణోత్ రామ్‌చందర్ కుమార్తెలు చి. సాత్విక, చి. తన్వైశ్రీల నూతన వస్త్రధారణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే Pocharam Srinivas Reddy, మాజీ డీసీసీబీ చైర్మన్ Pocharam Bhaskar Reddy హాజరై చిన్నారులను ఆశీర్వదించి ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన అతిథులు, చిన్నారులు విద్యాభ్యాసంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు వివాహాది శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, భాస్కర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
