విద్యలో ప్రతిభ కనబర్చిన హరిప్రికి సైకిల్ బహుకరణ.

విద్యలో ప్రతిభ కనబర్చిన హరిప్రికి సైకిల్ బహుకరణ.

వర్ని ప్రతినిధి చందర్ :- పదో తరగతి ఫలితాల్లో ప్రథమ ర్యాంక్ సాధించిన విద్యార్థినిని అభినందిస్తూ కోనేరు శశాంక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిల్ బహుకరణ కార్యక్రమం నిర్వహించారు.

 

 

వర్ని మండలం ఎస్‌.ఎన్‌.పురం జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్‌కు చెందిన తగ్లేపల్లి గ్రామ విద్యార్థిని హరిప్రి పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా బుధవారం ట్రస్ట్ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించి, ప్రోత్సాహకంగా సైకిల్‌ను అందజేశారు.

 

 

ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ విద్యలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడం తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

 

 

ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షుడు హరి, వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంతోష్, అల్లం సాయిలు, బక్క రాములు తదితరులు పాల్గొన్నారు.