ప్రభుత్వ స్కూల్ టెన్త్ టాపర్ విద్యార్థినికి సైకిల్ బహుకరణ.
బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్:- బాన్సువాడ పట్టణంలోని జడ్‌పీహెచ్‌ఎస్ హైస్కూల్ కొన కేంద్రంలో టెన్త్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని టెన్త్ పరీక్షల్లో 548 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచిన బైరిపోతగౌడ్ కుమారి బైరి భావనకు ట్రస్ట్ సభ్యులు సైకిల్‌ను బహుమతిగా అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ముఖ్య అతిథులు సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రతిభకు ప్రోత్సాహం అందించడం ఆనందంగా ఉందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, ఉపాధ్యాయులు చంద్రమోహన్, పురుషోత్తమ్ పాల్గొన్నారు. అలాగే ట్రస్ట్ బృంద సభ్యులతో పాటు బీజేపీ నాయకులు కొనాల గంగారెడ్డి, తృప్తి శివప్రసాద్, చీకట్ల రాజు, వాజ్ పై, తోట శంకర్, ఏముల నవీన్, ఆలపాటి హరికృష్ణ, గోవురు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
