రాంపూర్ గ్రామంలో నిరుపేద విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ.

రాంపూర్ గ్రామంలో నిరుపేద విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ.

బోధన్ ప్రతినిధి రాహుల్ : బోధన్ మండల కేంద్రం రాంపూర్ గ్రామం లో నిరుపేద కుటుంబాలకు చెందిన పాఠశాల విద్యార్థులకు శనివారం ఉచితంగా స్కూల్ కిట్లను పంపిణీ చేశారు.( ‘వర్డ్’) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డోలే సాయికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఈ కిట్లను అందజేశారు.పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సర్పంచ్ డోలే సాయికుమార్ స్వయంగా స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, షార్పనర్లు, ఎరేజర్లు మరియు వాటర్ బాటిళ్లతో కూడిన పూర్తి కిట్లను డొనేట్ చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థులకు తమ వంతు సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ సేవా కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ‘వర్డ్’ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ కె.విజయ్ కుమార్, పంచాయతీ సెక్రటరీ ఎండి అరీఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తమ పిల్లలకు అవసరమైన విద్యా సామగ్రిని ఉచితంగా అందించినందుకు విద్యార్థుల కుటుంబ సభ్యులు సర్పంచ్‌కు, వర్డ్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.