ఎంబీబీఎస్ విద్యార్థినికి వివేకానంద ఫౌండేషన్ రూ.6 వేల ఆర్థిక చేయూత.
బోధన్ ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చెక్కి క్యాంపుకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని అక్షితకు విద్యాభ్యాసానికి అవసరమైన గైడ్ బుక్స్ కొనుగోలు కోసం వివేకానంద ఫౌండేషన్ రూ.6,000 ఆర్థిక సహాయాన్ని అందించింది.
విద్యార్థిని అక్షిత తనకు గైడ్ బుక్స్ కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అవసరమని వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు సంతోష్‌ను సంప్రదించగా, ఆయన ఈ విషయాన్ని ఫౌండేషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. సభ్యులు సానుకూలంగా స్పందించి, పరస్పర సహకారంతో శ్రావణ్, కల్లేటి వీరప్రసాద్ సహాయంతో మొత్తం రూ.6,000ను అక్షితకు అందజేశారు.
ఈ సందర్భంగా అక్షిత మాట్లాడుతూ, తన విద్యాభ్యాసానికి అండగా నిలిచిన వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు సంతోష్‌తో పాటు ఆర్థిక సహాయం అందించిన శ్రావణ్, కల్లేటి వీరప్రసాద్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పాటునందిస్తూ అవసరమైన సమయంలో చేయూత అందిస్తున్న వివేకానంద ఫౌండేషన్ సేవలను స్థానికులు అభినందించారు.
