బాన్సువాడ డిపోలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా.

బాన్సువాడ డిపోలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా.

బాన్సువాడ ప్రతినిధి శివరామ్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ బస్సు డిపో ముందు బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మెరుపు ధర్నా నిర్వహించారు. యాజమాన్యం నోటీసు బోర్డుపై ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మూడు స్పెషల్ ఆఫర్ డ్యూటీలను ఓటీ (ఓవర్‌టైమ్) డ్యూటీలుగా మార్చడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు.

 

 

 

ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. గతంలో రెండు రోజుల డ్యూటీలను ఒకరోజు డ్యూటీగా మార్చి, అదనపు పనికి ఓటీ చెల్లిస్తామంటూ తమతో అధికంగా పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల ప్రకారం రోజుకు ఎనిమిది గంటల పని సమయాన్ని పాటించాల్సి ఉండగా, అదనపు పనిభారం మోపుతున్నారని ఆరోపించారు.

రోజుకు ఎనిమిది గంటల డే-అవుట్ డ్యూటీలను మాత్రమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని లేదా గతంలో మాదిరిగా మూడు స్పెషల్ ఆఫర్ సర్వీసులను యథావిధిగా కొనసాగించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. యాజమాన్యం తమ వైఖరిని మార్చుకోకపోతే తదుపరి రిలే నిరాహార దీక్షలు చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.