ఎరువుల యాప్‌పై రైతులకు అవగాహన సదస్సు.

ఎరువుల యాప్‌పై రైతులకు అవగాహన సదస్సు.

బాన్సువాడ ప్రతినిధి వడ్ల శ్రీనివాస్ చారీ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కాదులపూర్ గ్రామంలో గురువారం “ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్” (FFS) ఎరువుల బుకింగ్ యాప్‌పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు యాప్ వినియోగం, ఎరువుల బుకింగ్ విధానంపై అవగాహన కల్పించారు.

 

 

 

ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. పొలం పట్టా పాస్‌బుక్ కలిగిన ప్రతి రైతు తన ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని సూచించారు. రైతులు ఎరువుల బుకింగ్ కోసం యాప్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.

 

 

 

అధికంగా యూరియా వినియోగించడం వల్ల పంటలకు చీడపీడలు, తెగుళ్లు సోకే అవకాశం ఉందని, అందువల్ల వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నిర్ణీత మోతాదులో యూరియాను దఫాల వారీగా వినియోగించాలని సూచించారు. అనంతరం గ్రామ శివారులో సాగు చేస్తున్న మొక్కజొన్న, సోయాబీన్, కందిపంటలను పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీతల అంకుశ్, ఉప సర్పంచ్ పత్రు, గడిగే గణేష్, గడిగే శంకర్, అరె మనోజ్, రామదాసు తదితర రైతులు పాల్గొన్నారు.