రూ.30 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం.

రూ.30 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం.

వర్ని ప్రతినిధి చందర్:  వర్ని మండలంలోని జాకోర, శంకోర గ్రామాల్లో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో పర్యటించి నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు.

 

 

 

జాకోర గ్రామంలో ఎస్‌డీఎఫ్‌ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. మహిళా సంఘాల సమావేశాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం జాకోర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణ సముదాయం, ప్రహరీ గోడను ప్రారంభించారు.

 

శంకోర గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ పంచాయతీ పరిపాలన మరింత సౌకర్యవంతంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

 

 

అభివృద్ధికి ప్రాధాన్యం

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

 

 

ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ విజయకుమారి, వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. నూతన భవనాలు అందుబాటులోకి రావడంపై ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.