సరిహద్దు వివాదంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య.

సరిహద్దు వివాదంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య.

వర్ని ప్రతినిధి చందర్ :-  నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ మైనం వెంకటేష్ అలియాస్ వెంకన్న దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ భూమి సరిహద్దు వివాదమే హత్యకు కారణంగా ప్రాథమికంగా తెలుస్తోంది.

 

 

స్థానికుల వివరాల ప్రకారం.. సర్వే నంబర్‌ 392లోని వ్యవసాయ భూమి సరిహద్దుల విషయంలో వెంకన్నకు, నారాయణకు కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఏర్పడిన గొడవలో నారాయణ గొడ్డలితో వెంకన్నపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వెంకన్న సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

 

 

 

ఘటనపై సమాచారం అందుకున్న వర్ని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నారాయణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. భూ సరిహద్దు వివాదమే హత్యకు ప్రధాన కారణమా.. లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

హత్యకు గల పూర్తి కారణాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో తగిలిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

వర్ని ప్రతినిధి: చందర్