ధాన్యం గోదాములో భారీ చోరీపై అనుమానాలు.

ధాన్యం గోదాములో భారీ చోరీపై అనుమానాలు.

గోదాములో నిల్వలు గల్లంతైనట్లు ప్రచారం.

చండూరు ప్రతినిధి రాము: చండూరు వ్యవసాయ మార్కెట్‌కు చెందిన ధాన్యం నిల్వ గోదాములో భారీగా ధాన్యం గల్లంతైనట్లు ప్రచారం జరగడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. గోదాములో నిల్వ ఉన్న పెద్ద సంఖ్యలో ధాన్యం బస్తాలు రాత్రికి రాత్రే మాయమైనట్లు వార్తలు రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 

గత కొంతకాలంగా మార్కెట్ యార్డులోని ధాన్యం నిల్వలపై నిఘా కొరవడిందని, ఇదే అదనుగా కొందరు వ్యక్తులు ధాన్యం బస్తాలను తరలించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

 

 

 

భారీ మొత్తంలో ధాన్యం గల్లంతైనట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వెంటనే గోదామును పరిశీలించి, నిల్వలపై పూర్తి స్థాయి లెక్కలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని స్టాక్ రికార్డులను పరిశీలించి, ధాన్యం గల్లంతు వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.