బాన్సువాడ డివిజన్‌లో ప్రైవేట్ పాఠశాలల బంద్.

బాన్సువాడ డివిజన్‌లో ప్రైవేట్ పాఠశాలల బంద్.

ట్రస్మా ఆధ్వర్యంలో నిరసన

బాన్సువాడ ప్రతినిధి వడ్ల శ్రీనివాస్ చారీ : నల్గొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యను ఖండిస్తూ శుక్రవారం బాన్సువాడ డివిజన్‌లోని పలు ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా ట్రస్మా బాన్సువాడ అధ్యక్షుడు పాశం రాజిరెడ్డి మాట్లాడుతూ, విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయురాలిని విద్యార్థులే హత్య చేయడం తీవ్రంగా బాధించిందన్నారు.

 

 

 

తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, అలవాట్లను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. విద్యార్థుల్లో ఏవైనా తప్పు ప్రవర్తన లేదా సమస్యలు కనిపిస్తే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని కోరారు. పిల్లల మానసిక స్థితి, ప్రవర్తనపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.

 

 

 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని పాశం రాజిరెడ్డి డిమాండ్ చేశారు. రూపా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.