గోమాతకు హిందూ ధర్మ సంప్రదాయాల ప్రకారం ఘనంగా అంత్యక్రియలు.

గోమాతకు హిందూ ధర్మ సంప్రదాయాల ప్రకారం ఘనంగా అంత్యక్రియలు.

వర్ని ప్రతినిధి చందర్:-  నిజామాబాద్ జిల్లా వర్ని మండలం ఎస్‌ఎన్ పురం గ్రామపంచాయతీ పరిధిలో అనారోగ్యంతో మృతి చెందిన ఆవుకు గ్రామపంచాయతీ అధికారులు, పాలకవర్గ సభ్యులు హిందూ ధర్మ సంప్రదాయాల ప్రకారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

 

 

 

మృతి చెందిన గోమాతకు పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హిందూ ధర్మ విధానంలో అంత్యక్రియలు నిర్వహించి గౌరవప్రదంగా అంతిమ వీడ్కోలు పలికారు.

 

ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయంలో గోవును గోమాతగా, అమ్మగా భావిస్తామని తెలిపారు. అందుకే అనారోగ్యంతో మృతి చెందిన ఆవుకు కూడా మనిషికి ఇచ్చే గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గోవుల పట్ల ప్రజల్లో ఉన్న భక్తి, గౌరవాన్ని చాటిచెప్పేలా గోమాతకు అంతిమ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.