వీరభద్ర స్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు.
బాన్సువాడ ప్రతినిధి వడ్ల శ్రీనివాస్ చారీ: శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని శ్రీ వీరభద్ర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది.

పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ పూజారి మఠం వీరభద్రప్ప భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ కుటుంబాలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు.
